Mahaa Daily Exclusive

  హరీష్‌రావు ఇంటికి వెళ్లిన కేసీఆర్…

Share

  • హరీష్‌రావు ఇంటికి వెళ్లిన కేసీఆర్
  • వైరల్ గా కేటీఆర్ , హిమాన్ష్ ఫొటోలు

హైదరాబాద్,
బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం రోజున మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు ఇంటికి వెళ్లారు. హరీశ్‌రావు తండ్రి తన్నీరు సత్యనారాయణరావు గతేడాది చనిపోగా.. ఆదివారం సంవత్సరీక కార్యక్రమం నిర్వహించారు. అందులో కేసీఆర్ పాల్గొన్నారు. తన్నీరు సత్యనారాయణరావు చిత్రపటానికి పూలమాల వేసి కేసీఆర్ నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా హాజరయ్యారు. తన కుమారుడు హిమాన్షుతో కలిసి కార్యక్రమంలో పాల్గొని తన్నీరు సత్యనారాయణరావుకు నివాళులు అర్పించారు. ఒకే చోట బీఆర్ఎస్‌కు చెందిన ముగ్గురు ముఖ్య నేతలు కనిపించడంతో ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. హరీశ్‌రావు తండ్రి సత్యనారాయణరావు మరణించి ఏడాది పూర్తయిన సందర్భంగా కుటుంబ సభ్యులు ఆదివారం సంవత్సరీక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కేసీఆర్ హాజరై సత్యనారాయణరావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పలకరించారు. హరీశ్‌రావు కేసీఆర్‌కు మేనల్లుడు కావడంతో కుటుంబ కార్యక్రమాలకు ఆయన హాజరయ్యారు. గతంలో సత్యనారాయణరావు మరణించినప్పుడు కూడా కేసీఆర్ ఆయన పార్థివదేహానికి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు. కుటుంబసభ్యుల మధ్య ఈ కార్యక్రమం నిర్వహించారు.
……