Mahaa Daily Exclusive

  భూగ‌ర్భ జ‌లాల‌ను ఎలా పెంచుదాం..?

Share

  • భూగ‌ర్భ జ‌లాల‌ను ఎలా పెంచుదాం..?
  • వ‌ర‌ద‌ల నివార‌ణ‌కు తీసుకోవాల్సిన చ‌ర్య‌లేంటి..?
  • శాస్త్ర‌వేత్త‌ల‌తో చ‌ర్చించిన హైడ్రా క‌మిష‌న‌ర్‌

హైద‌రాబాద్‌, మహా : న‌గ‌రంలో భూగ‌ర్భ జ‌లాల‌ను పెంపొందించ‌డానికి ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోవాలి..? వ‌ర‌ద‌లు నియంత్రించ‌డానికి తీసుకోవాల్సిన చ‌ర్య‌లు ఏంటి..? ఎక్క‌డ చెరువులు, స్టెప్‌వెల్స్ ను పెద్ద యెత్తున చేప‌డితే భూగ‌ర్భ జ‌లాలు పెరుగుతాయి. వ‌ర్షం నీరు ఎక్క‌డ ఎక్కువ మొత్తంలో భూమిలోకి ఇంకే అవ‌కాశం ఉంది..? వ‌ర‌ద నీటిని ఒడిచి ప‌ట్ట‌డానికి ఎలాంటి చ‌ర్య‌లు చేప‌ట్టాలి.. ప్ర‌స్తుతం ఏ ప్రాంతాల్లో భూగ‌ర్భ జ‌లాలు ఎక్కువ మొత్తంలో ఉన్నాయి. భూగ‌ర్భ జ‌లాలు లేని ప్రాంతాలు ఏవి.? వ‌ర్షం ఎక్కువ మొత్తంలో కురిసే ప్రాంతాలేవి.. ఎంత మొత్తంలో నీరు భూమిలోకి ఇంకుతోంది.. న‌గ‌రంలో వ‌ర్ష‌పాతం ఎంత‌..? ఆ వ‌ర్షం ఎంత మొత్తంలో మ‌నం ఒడిచి ప‌డుతున్నాం.. ఇందుకు తీసుకోవాల్సిన చ‌ర్య‌లు ఏ విధంగా ఉండాలి.. ఇత్యాది అంశాల‌ను సంబంధిత శాఖ‌ల శాస్త్ర‌వేత్త‌లో హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ బుధ‌వారం హైడ్రా కార్యాలయంలో చ‌ర్చించారు. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్, తెలంగాణ గ్రౌండ్ వాటర్ శాఖ, ఇండియా మెటీరియలాజికల్ డిపార్ట్‌మెంట్, తెలంగాణ స్టేట్ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీకి చెందిన ప‌లువురు అధికారులు, శాస్త్ర‌వేత్త‌లు ఈ చ‌ర్చా కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. నగరంలో వరద ముప్పును తగ్గించి, భూగర్భ జలాలను పెంచేందుకు హైడ్రా శాస్త్రీయంగా అడుగులు వేస్తున్న స‌మ‌యంలో.. అర్బన్ ఫ్లడ్ రిస్క్ మేనేజ్‌మెంట్ ప్రోగ్రామ్ ఫేజ్ – III లో భాగంగా క్యూర్ ప్రాంతంలో చేపట్టాల్సిన చర్యలపై ఈ స‌మావేశం లోతుగా చ‌ర్చించింది. భౌగోళిక, భూస్వరూప మ్యాపింగ్, భూగర్భ పొరలు, గ్రౌండ్ వాటర్ రీఛార్జ్‌కు అనువైన ప్రాంతాల గుర్తింపు, నేల స్వభావం, న‌గ‌రంలో గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ సామర్థ్యం, రీఛార్జ్ పిట్స్‌కు అనువైన ప్రాంతాల ఎంపిక, భూగర్భ జల మట్టాలు, నీటి నాణ్యత, రీఛార్జ్ – డిశ్చార్జ్ జోన్లు, రీఛార్జ్ పిట్స్‌కు అనువైన ప్రాంతాల గుర్తింపు, క్యాచ్‌మెంట్, సబ్ క్యాచ్‌మెంట్ విభజనకు సంబంధించిన ప‌లు అంశాల‌ను చ‌ర్చించారు. గత 25 ఏళ్ల (2000-2025) వర్షపాత డేటా, వార్షిక, నెలవారీ, అత్యధిక వర్షపాత విశ్లేషణ, వర్షపాత తీవ్రత, ప్రస్తుత వాతావరణ కేంద్రాల నెట్‌వర్క్, కొత్త కేంద్రాల ఆవ‌శ్య‌క‌త‌పై స‌మావేశం చ‌ర్చించింది. హైడ్రా అడిష‌న‌ల్ డైరెక్ట‌ర్ శ్రీ వ‌ర్ల పాప‌య్య, శాస్త్ర‌వేత్త‌లు డా. ర‌ఘు నండింప‌ల్లి, ఎస్‌. స్టెల్లా, డా. వై.వి. రామారావు, డా. శివ‌కుమార్‌, ఎ. అనిల్‌కుమార్‌, డా. రాజ‌ర్షి, డా. సాహేబ్‌రావ్‌, డా. కె. ల‌క్ష్మా, హైడ్రా డీఎఫ్‌వోలు గౌతం, శ్రీ‌ధ‌ర్ రెడ్డి త‌దిత‌రులు ఈ స‌మావేశంలో పాల్గొన్నారు.