Mahaa Daily Exclusive

  కీసరగుట్టలో తాగునీటి సమస్యకు పరిష్కారం స్వప్న విజయ్ రెడ్డి చొరవ.. డిప్యూటీ కమిషనర్ రామలింగం స్పందనతో సరఫరా పునరుద్ధరణ..

Share

కుషాయిగూడ, మహా : కీసరగుట్ట గ్రామంలో గత కొన్ని రోజులుగా నెలకొన్న తాగునీటి సమస్య పరిష్కారమైంది. తాగునీటి పైపులు పగిలిపోవడంతో మరమ్మతుల కోసం గుంతలు తవ్వి సుమారు పది రోజులు గడిచినా పనులు పూర్తికాకపోవడంతో వారం రోజులుగా నీటి సరఫరా నిలిచిపోయింది. దీంతో గ్రామస్తులు ప్రైవేటు ట్యాంకర్ల ద్వారా డబ్బులు చెల్లించి నీటిని కొనుగోలు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఈ సమస్యను కాంగ్రెస్‌ పార్టీ కీసర డివిజన్‌–1 అధ్యక్షురాలు రామిడి స్వప్న విజయ్‌రెడ్డి దృష్టికి గ్రామస్తులు తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన ఆమె సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి చొరవ తీసుకున్నారు. కీసర డిప్యూటీ కమిషనర్‌ రామలింగం కూడా స్పందించి అధికారులతో సమన్వయం చేయడంతో తాగునీటి సరఫరా పునరుద్ధరించబడింది.

ప్రజల ఇబ్బందులను గుర్తించి వెంటనే స్పందించి సమస్య పరిష్కారానికి కృషి చేసిన రామిడి స్వప్న విజయ్‌రెడ్డికి, సహకరించిన డిప్యూటీ కమిషనర్‌ రామలింగంకు గ్రామస్తులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

Latest