Mahaa Daily Exclusive

  కర్ణాటకలో బస్ ఛార్జీల పెంపు…!

Share

కర్ణాటకలో బస్ ఛార్జీల పెంపు
బస్ టికెట్ ఛార్జీలను 15 శాతం పెంచేందుకు కర్ణాటక క్యాబినెట్ ఆమోదం తెలిపింది. KSRTC, BMTC బస్సుల్లో జనవరి 5 నుంచి కొత్త ఛార్జీలు అమల్లోకి వస్తాయని మంత్రి హెచ్.కె.పాటిల్ తెలిపారు. రేట్లు పెంచినా ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర కంటే కర్ణాటకలోనే ఛార్జీలు తక్కువగా ఉంటాయన్నారు. కాగా కర్ణాటకలో మహిళలకు ఫ్రీ బస్ స్కీం వల్ల నెలకు రూ.417 కోట్లు ఖర్చవుతోంది. తాజాగా రేట్ల పెంపుతో రోజుకు రూ.8 కోట్లు చెప్పున నెలకు రూ.240 కోట్ల అదనపు ఆదాయం రానుంది.