Mahaa Daily Exclusive

  దీక్షా స్థలిలో ఖరీదైన వాహనం సోషల్ మీడియాలో ఫొటోలు వైరల్ ప్రశాంత్ కిషోర్ దీక్షపై అనుమానాలు

Share

బీహార్‌ పబ్లిక్‌ సర్వీసెస్ పరీక్షను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులకు సంఘీభావంగా జన్‌ సూరజ్‌ పార్టీ వ్యవస్థాపకుడైన ప్రశాంత్‌ కిషోర్‌ పాట్నాలోని గాంధీ మైదాన్‌లో గాంధీ విగ్రహం వద్ద జనవరి 2 నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు. పేపర్ లీక్ అయ్యిందన్న ఆరోపణల నేపథ్యంలో అభ్యర్థుల నిరసన మద్దతు తెలుపుతూ ఆయన దీక్ష చేపట్టారు. అయితే, ప్రశాంత్‌ కిషోర్‌కు చెందిన ఖరీదైన వాహనం ఆ నిరసన ప్రాంతం సమీపంలో పార్క్‌ చేసి ఉంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో భారీగా వైరల్ అవుతున్నాయి. రూ. కోట్ల విలువైన ఈ వాహనంలో ఇంటికి సంబంధించిన కిచెన్‌, బెడ్‌ రూమ్‌, ఏసీతో సహా అన్ని సౌకర్యాలున్నాయి. ఈ నేపథ్యంలో ప్రశాంత్‌ కిషోర్‌ దీక్షపై నెటిజన్స్ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

Latest