ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇంటర్ బోర్డు తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి ఇంటర్ ఫస్టియర్‌లో పరీక్షలు ఉండబోవంటూ ప్రకటించింది. వచ్చే ఏడాది నుంచి ఏపీలో ఇంటర్ ఫస్టియర్ పరీక్షలను తొలగిస్తున్నట్లు బోర్డు కార్యదర్శి కృతికా శుక్లా వెల్లడించారు. ఇక మీదట బోర్డు కేవలం సెకండియర్ పరీక్షలను మాత్రమే నిర్వహిస్తుందని వివరించారు. ఈ అంశంపై విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యావేత్తల నుంచి సలహాలు, సూచనలు స్వీకరిస్తామన్నారు. 2025-26 ఇంటర్ ఫస్టియర్‌లో ఎన్‌సీఈఆర్టీ పాఠ్య పుస్తకాలను ప్రవేశపెట్టనున్నట్లు వెల్లడించారు. దీంతో నీట్, జేఈఈ వంటి జాతీయస్థాయి పోటీ పరీక్షలకు సైతం దోహదం పడుతుందన్నారు. విద్యార్థులపై ఒత్తిడి తొలగించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.
Post Views: 52








