Mahaa Daily Exclusive

  చంద్రబాబుదే బాధ్యత భగ్గుమన్న వైయస్ జగన్ ..!

Share

చంద్రబాబు సీఎం అయ్యాక టీటీడీ ప్రతిష్ట దెబ్బతింటోందని, తిరుపతి తొక్కిసలాట ఘటనకు పూర్తి ప్రభుత్వాన్నిదేనంటూ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం తిరుపతి పద్మావతి మెడికల్‌ కాలేజ్‌ ఆస్పత్రిలో బాధితులను పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాతూ కూటమి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఇది కచ్చితంగా ప్రభుత్వ తప్పిదం. సీఎం మొదలు, టీటీడీ అధికారులు, ఛైర్మన్, జిల్లా ఎస్పీ, కలెక్టర్‌ అందరూ ఈ ఘటనకు బాధ్యులే. అందుకే వారందరిపై కచ్చితంగా చర్యలు తీసుకోవాలి. తొక్కిసలాటను తక్కువ చేసి చూపుతూ, తప్పుడు సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. బీఎన్‌ఎస్‌ 194 సెక్షన్‌కు బదులు బీఎన్‌ఎస్‌ 105 సెక్షన్‌ కింద ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలి. ఈ దుర్ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు రూ.50 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలి. గాయపడినవారికి మంచి వైద్యం అందించడంతోపాటు, డిశ్చార్జ్‌ సమయంలో కనీసం రూ. 5 లక్షల చొప్పున సాయం అందించాలి.
చంద్రబాబుకు దేవుడంటే భక్తి లేదు.. భయం లేదు. అందుకే శ్రీ వెంకటేశ్వరస్వామి వారి లడ్డూ ప్రసాదంపైనా ఆరోపణలు చేశారు. దుష్ప్రచారం చేశారు. ఈరోజు కూడా ఆయన వైఖరి వల్లనే ఈ దుర్ఘటన జరిగింది. తిరుపతిలో జరిగిన ఈ ఘటన రాష్ట్ర చరిత్రలోనే లేదు. తొక్కిసలాటకు ఇంతమంది బలి కావడం గతంలో ఎప్పుడూ చూడలేదు. కానీ, ఈరోజు ఇలాంటి పరిస్థితి వచ్చింది.

ఇంత జరిగినా, సీఎం చంద్రబాబు పద్ధతి లేకుండా మాట్లాడారు. ఎఫ్‌ఐఆర్‌ కూడా తప్పులతడకగా నమోదు చేశారు. టీటీడీ అనేది ఒక గొప్ప వ్యవస్థ. వైకుంఠ ఏకాదశి రోజున లక్షల మంది వస్తారు. ఆరోజు స్వామి వారిని దర్శిస్తే, మహా పుణ్యం వస్తుందని భక్తుల నమ్మకం. అందుకే లక్షల మంది తరలి వస్తారు. ఆ దర్శనం కోసం టోకెన్లు ఇచ్చే కౌంటర్ల వద్ద ఎందుకు సెక్యూరిటీ కల్పించలేదు? ఇది సీఎం చంద్రబాబు సొంత జిల్లా అయినా టీటీడీ బాధ్యతారహితంగా వ్యవహరించింది. దుర్ఘటనలో ఇప్పటికే ఆరుగురు చనిపోయారు. ఉజ్జాయింపు లెక్కల ప్రకారం చూస్తే కనీసం 50 నుంచి 60 మంది గాయపడ్డారు. టీటీడీ అధికారులు మొదలు జిల్లా కలెక్టర్‌ వరకు అందరూ దీనికి బాధ్యులు.

చంద్రబాబు నిర్వాకం వల్ల గతంలో గోదావరి పుష్కరాల్లో తొక్కిసలాటకు 29 మంది చనిపోయారు. కేవలం ఆయన పబ్లిసిటీ పిచ్చి కోసం అంత మందిని బలి తీసుకున్నారు. నేను ఇక్కడికి వస్తానని, వాస్తవాలు ప్రజలకు చెబుతానని భయపడి నేను ఇక్కడికి రాకుండా అడ్డుకోవాలని చూశారు. నన్ను ట్రాఫిక్‌లో ఆపి, నా కాన్వాయ్‌ ఆస్పత్రికి రావొద్దన్న కుట్ర చేశారు. చివరకు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని తరలించాలని చూశారు. వారు ఎదురుతిరగడంతో ఊరుకున్నారు. అప్పటికి కొందరు పేషెంట్లను బలవంతంగా డిశ్చార్జ్‌ చేశారు’ అంటూ జగన్ పేర్కొన్నారు.

Latest