టీఆర్ సైనికుడు కాదు… ఒక యువరాజు అంటూ భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. ఈ మేరకు ఆయన ఓ వీడియోను విడుదల చేశారు. ‘మాకు డబ్బు వ్యామోహం లేదు అని కేటీఆర్ అంటున్నాడు.. కమీషన్ల కోసమే మీ సోదరి ఎమ్మెల్సీ కవిత ఢిల్లీలో లిక్కర్ వ్యాపారం చేశారు. మరోసారి తెలంగాణ ప్రజలకు చెవిలో పువ్వు పెట్టొద్దు కేటీఆర్. కేటీఆర్ మతిభ్రమించి మాట్లాడుతున్నాడు. మీకు డబ్బు వ్యామోహం లేదంటే ప్రజలు ఎలా నమ్ముతారు. రూ. 7 లక్షల కోట్లలో కాంట్రాక్టర్లకు ఎన్ని లక్షల కోట్లు అప్పనంగా ముట్ట చెప్పారు చెప్పాలి. పాత పాటలు పాడొద్దు కేటీఆర్ కొత్త ముచ్చట చెప్పండి తెలంగాణ ప్రజలు నమ్ముతారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడాన్ని మీరు జీర్ణించుకోలేకపోతున్నారనేది తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. కేటీఆర్ మీరు కేసీఆర్ సైనికునివి కాదు, నువ్వు కేసీఆర్ కొడుకు వు మాత్రమే. అధికారం కోల్పోయిన యువరాజుకు మతిభ్రమించి మాట్లాడుతున్నాడు. మీ నాయన 2002లో ఏదైతే నినాదంతో వచ్చాడో ఈరోజు మీరు కూడా అదే నినాదం చెబుతున్నారు. కానీ, తెలంగాణ ప్రజలు ఇంకా మిమ్మల్ని నమ్మే పరిస్థితిలో లేరు. దళిత ముఖ్యమంత్రి, ఉద్యోగ నియామకాలు కాపల కుక్కని అని ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చారు. మీరు అప్పు చేసిన రూ. 7 లక్షల కోట్లు సరైన పద్ధతిలో ఖర్చు చేసుంటే కేజీ టు పీజీ ఉచిత విద్య, ఉచిత వైద్యం, రైతులందరికీ రుణమాఫీ, రైతు భరోసా, హాస్టల్ విద్యార్థులకు సన్న బియ్యంతో భోజనం ఇవన్నీ అందేవి. చేసిన ఆ అప్పులో రూ. లక్ష కోట్లు దండుకున్నది మీ కుటుంబం’ అంటూ ఆయన పేర్కొన్నారు.





