Mahaa Daily Exclusive

  తిరుపతిలో గతంలో ఇటువంటివి జరగలే కూటమి ప్రభుత్వంపై కేసు నమోదు చేయాలి – మాజీ మంత్రి రోజా

Share

తిరుపతి తొక్కిసలాట ఘటన నేపథ్యంలో కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతిలో కేవలం ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఆరుగురు చనిపోయారన్నారు. ఇవి ప్రభుత్వం చేసిన హత్యలేనంటూ ఆమె విమర్శించారు. వెంటనే సీఎం, మంత్రులు, పాలకమండలి సభ్యులు తమ పదవులకు రాజీనామాలు చేయాలన్నారు. వారిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలంటూ రోజా డిమాండ్‌ చేశారు.

గురువారం తాడేపల్లి వైసీపీ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు . ‘తిరుపతిలో గతంలో ఇటువంటి దురదృష్ట ఘటనలు జరిగిన దాఖాలాలు లేవు. చంద్రబాబు టీటీడీ చైర్మన్‌గా అసమర్దుడిని నియామించారు. లక్షలాధి మంది వచ్చే దేవస్థానంలో భద్రతపై చిత్తశుద్ధిలేని వ్యక్తిని ఎస్పీగా పెట్టారు. వీరంతా చంద్రబాబుకు ఊడిగం చేసేందుకే పనిచేస్తున్నారు తప్ప భక్తుల కోసం పనిచేయడంలేదు. బాబు అధికారంలోకి వచ్చినప్పుడల్లా ఇటువంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. గతంలో గోదావరి పుష్కరాల సమయంలో జరిగిన తొక్కిసలాట 29 మంది మృతిచెందారు. అదేవిధంగా ఇటీవల విజయవాడలో వరదల వల్ల 60 మంది చనిపోయారు. సనాతన యోధుడని గొప్పగా చెప్పుకున్న పవన్‌కల్యాణ్‌ తిరుపతి ఘటనపై స్పందించాలి. వెంటనే కూటమి ప్రభుత్వం రాజీనామా చేయాలి. తెలంగాణలో పుష్ప సినిమా బెనిఫిట్‌ షోలో తొక్కిసలాట జరిగితే హీరో అల్లు అర్జున్‌పై కేసు నమోదు చేసినట్లుగానే తిరుపతి ఘటనపై చంద్రబాబు , టీటీడీ పాలక మండలి, అధికారులను బాధ్యులు చేస్తూ క్రిమినల్‌ కేసులను నమోదు చేయాలి. అదేవిధంగా ఈ ఘటనపై పీఠాధిపతులు సైతం స్పందించి పవిత్రమైన పుణ్యక్షేత్రంలో ప్రభుత్వ నిర్లక్షాన్ని ఎండగట్టాలి. బీజేపీ నాయకులకు నిజంగా భక్తి మీద శ్రద్ధ ఉంటే తిరుపతి ఘటనపై ప్రధాని మోదీకి ఫిర్యాదు చేయాలి’ అంటూ రోజా పేర్కొన్నారు.

Latest