Mahaa Daily Exclusive

  బన్నీకి బిగ్ రిలీఫ్ ఆదివారం హాజరు నుంచి మినహాయింపు…!

Share

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు నాంపల్లి కోర్టులో కొంత ఊరట లభించింది. సంధ్య థియేటర్ ఘటనలో అరెస్టైన అల్లు అర్జున్ కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన కోర్టు షరతులను విధించింది. తాజాగా ఈ షరతులలోనూ సడలింపులను ఇచ్చింది. ప్రతీ ఆదివారం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కు వచ్చి హాజరు కావాలని, తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకు విదేశాలకు వెళ్లకూడదు అంటూ అల్లు అర్జున్‌కు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. తాజాగా మనరికొంత ఉపశమనం కల్పించింది కోర్టు. ప్రతీ ఆదివారం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కు వెళ్లే నిబంధనను ఎత్తివేసింది. భద్రతా కారణాల దృష్ట్యా అల్లు అర్జున్ దాఖలు చేసుకున్న విజ్ఞప్తికి అంగీకరించిన నాంపల్లి కోర్టు.. ప్రతీ ఆదివారం పోలీస్ స్టేషన్‌కు రావాల్సిన అవసరం లేదని పేర్కొంది. అదే సమయంలో విదేశాలకు కూడా వెళ్లేందుకు అల్లు అర్జున్ నాంపల్లి కోర్టు అనుమతి ఇచ్చింది. గత ఆదివారం చిక్కడపల్లి పోలీస్‌ స్టేషన్‌కు వచ్చిన అల్లు అర్జున్ సంతకం చేసి వెళ్లారు. అప్పుడు అల్లు అర్జున్‌ను చూసేందుకు ఫ్యాన్స్‌ భారీగా ఎగబడటంతో వారిని కంట్రోల్ చేయడం పోలీసులకు కొంత ఇబ్బందికరంగా మారింది. ఈ నిబంధన నుంచి మినహాయింపును ఇచ్చిన నాంపల్లి కోర్టు కేసు విషయంలో పోలీసుల విచారణకు సహకరించాలని సూచించింది.

Latest