Mahaa Daily Exclusive

  13న హోం మంత్రి స్వగృహం వద్ద సంక్రాంతి సంబరాలు…!

Share

పాయకరావుపేట నియోజకవర్గ పరిధిలో నక్కపల్లి మండలం సారిపల్లిపాలెంలో హోం మంత్రి వంగలపూడి అనిత ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటనున్నాయి. ఈ నెల 13న సోమవారం ఉదయం భోగి మంటలతో సంక్రాంతి సంబరాలు ప్రారంభం కానున్నాయని టీడీపీ నక్కపల్లి మండల పార్టీ అధ్యక్షలు కొప్పిశెట్టి వెంకటేష్ తెలిపారు. ఉదయం తొమ్మిది గంటలకు నియోజకవర్గ స్థాయి ముగ్గుల పోటీలు జరగనున్నాయని, విజేతలకు మొదటి బహుమతి (రూ. 20,000), ద్వితీయ బహుమతి (రూ. 15,000) తృతీయ బహుమతి (రూ. 10,000) అందజేయనున్నట్లు, మహిళలు పెద్దసంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఉత్తరాంధ్రా సంప్రాదాయాలు ఉట్టిపడేలా కోలాహాలంగా కోలాటాలు, తప్పుడుగుళ్ళు కళాకారుల ప్రదర్శనలు జరగనున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో పాయకరావుపేట టీడీపీ మండల పార్టీ అధ్యక్షలు పెద్దిరెడ్డి చిట్టిబాబు, ఎస్ రాయవరం మండల పార్టీ అధ్యక్షలు అమలం కంటి అబద్ధం, కోటఉరట్ల మండలపార్టీ అధ్యక్షలు జానకి శ్రీను, పాయకరావుపేట నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యక్షరాలు రమాకుమారి, కొప్పిశెట్టి బుజ్జి, గుర్రం రామకృష్ణ, గోసల శ్రీకాంత్, వైబోయిన రమణ, వెలగా శ్రీను, సీహెచ్ పద్దు, కట్టా శ్రీను తదితరలు పాల్గొన్నారు.

Latest