Mahaa Daily Exclusive

  నిజామాబాద్‌లో జాతీయ పసుపు బోర్డు ప్రారంభోత్సవం…!

Share

నిజామాబాద్‌ జిల్లా రైతుల చిరకాల వాంఛ నెరవేరింది. నిజామాబాద్‌లో జాతీయ పసుపు బోర్డు ఏర్పాటైంది. కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ దిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా వర్చువల్‌గా దీనిని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ ధర్మపురి అర్వింద్‌ పాల్గొన్నారు.

అనంతరం కేంద్రమంత్రి పీయూష్‌ మాట్లాడుతూ సంక్రాంతి రోజున నిజామాబాద్​లో పసుపు బోర్డు ప్రారంభించుకోవడం సంతోషకరంగా ఉందన్నారు. ప్రపంచంలో భారత్‌కు గొప్ప పేరు ఉందని, నాణ్యమైన పంట పండించేలా రైతులను ప్రోత్సహిస్తామన్నారు. ప్రధాని మోదీ ఆశీర్వాదంతో పసుపు బోర్డు ఏర్పాటు చేశామని, ఆయన ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నారని తెలిపారు. తొలి ఛైర్మన్‌గా నియమితులైన గంగారెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు.