Mahaa Daily Exclusive

  కుంభమేళాలో రాగాల కుంభం…!

Share

త్రివేణి సంగమం వద్ద కళా సాంస్కృతిక మహా కుంభం నిర్విస్తున్నారు. జనవరి 16 నుంచి ప్రారంభమైన రాగాల మేళా ఫిబ్రవరి 24 వరకు సాంస్కృతిక మహాకుంభం ఉంటుంది. ప్రధాన వేదికగా గంగ పండల్ ఉంటుంది. ఇక్కడ కైలాష్ ఖేర్, సోనూ నిగమ్ వంటి దిగ్గజ గాయకులు సహా దేశంలోని ప్రముఖ కళాకారులు ప్రదర్శనలు ఇవ్వనున్నారు. యమునా పండల్, సరస్వతి పండల్‌లో కూడా సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. కళాప్రదర్శనల కోసం నాలుగు చోట్ల 24 వేదికలను ఏర్పాటు చేశారు. ప్రయాగ్‌ రాజ్‌లో జరుగుతున్న మహాకుంభ్‌ మేళాకు భక్తులు పోటెత్తుతున్నారు. 45 రోజుల్లో 50కోట్ల మంది త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరిస్తారు. ఇప్పటికే ఆరుకోట్ల మంది భక్తులు పుణ్యస్నాలు ఆచరించగా, జనవరి 29 మౌని అమావాస్య, ఫిబ్రవరి 3 వసంత పంచమి స్నానం, ఫిబ్రవరి 12 మాఘ పౌర్ణమి, కుంభమేళా చివరి రోజు ఫిబ్రవరి 26 మహా శివరాత్రికావడంతో.. ఆ రోజుల్లో భక్తుల తాకిడి ఎక్కువుగా ఉండే అవకాశం ఉంది. ఈ రోజులు ఎంతో ప్రత్యేకమని చెబుతున్నారు. దీంతో ఆయా రోజులను పరిగణనలోకి తీసుకుని తెలుగురాష్ట్రాల ప్రజలు కుంభమేళా ప్లాన్ చేసుకోవాలని నిర్వాహకులు సూచిస్తున్నారు. ఈ రోజులను గుర్తుపెట్టుకుని దానికి తగ్గట్లు ఏర్పాట్లు చేసుకోవాలి. ప్రపంచంలోనే అతి పెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమం మహాకుంభమేళాలో నాలుగో రోజు. ఫిబ్రవరి 26 వరకూ జరగనున్న మహా కుంభ మహోత్సవానికి దేశ విదేశీ భక్తులు పోటెత్తుతున్నారు.144 ఏళ్లకు ఒకసారి వచ్చే అరుదైన కుంభమేళా కావడంతో త్రివేణీ సంగమానికి వచ్చే భక్తుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. గంగా నదీతీర ప్రాంతమంతా జనసంద్రాన్ని తలపిస్తోంది.