Mahaa Daily Exclusive

  ఆరుకోట్ల భక్తులు.. నాలుగురోజుల్లోనే మహా కుంభమేళా.. మహా భక్తి పారవశ్యం…!

Share

మహా కుంభమేళా భక్తజనం పారవశ్యంతో వైభవోపేతంగా సాగుతోంది. మహాకుంభమేళా 2025 గురువారం తెల్లవారుజామున 5 గంటల నుండే వివిధ రంగాలకు చెందిన భక్తులు త్రివేణీసంగమంలో మునిగిపోయారు . యమునా, గంగా ‘ఆధ్యాత్మిక’ సరస్వతి మూడు నదుల సంగమం. ఉత్తర భారతదేశం చలిగాలులతో అతలాకుతలం అవుతుండగా, తేలికపాటి చినుకులతో ఉష్ణోగ్రత మరింత పడిపోయింది. అయినా భక్తులు హరహరమహాదేవ అంటూ పోటెత్తుతున్నారు. కుంభమేళా ప్రారంభమైన మొదటి నాలుగు రోజుల్లోనే 6 కోట్ల మంది భక్తులు సంగమంలో స్నానాలు చేశారు. 45 రోజుల పండుగ ముగిసే నాటికి ఈ సంఖ్య 50 కోట్లు దాటుతుందని అంచనా.