Mahaa Daily Exclusive

  ఛత్తీస్ గఢ్-తెలంగాణ సరిహద్దులో భారీ ఎన్ కౌంటర్ 17 మంది నక్సల్స్‌ హతం..!

Share

ఛత్తీస్‌గఢ్‌లోని దక్షిణ బస్తర్ ప్రాంతంలో గురువారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో 17 మంది నక్సలైట్లు హతమయ్యారు. తెలంగాణ సరిహద్దుల్లోని బీజాపూర్ జిల్లా ఊసూర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో పూజారీ కాంకేర్‌, మారేడుబాక ప్రాంత అడవుల్లో ఉదయం తొమ్మిది గంటల నుంచి ఇరుపక్షాల మధ్య కాల్పులు జరుగుతున్నాయి. ఈ నెలలో ఇది రెండో ఎన్‌కౌంటర్‌. మూడు జిల్లాలకు చెందిన డిస్ట్రిక్ట్‌ రిజర్వ్‌ గార్డ్ (డీఆర్‌జీ), ఐదు బెటాలియన్ల సీఆర్పీఎఫ్‌, కోబ్రా, సీఆర్పీఎఫ్‌ 229వ బెటాలియన్‌ బలగాలు నక్సల్స్‌ ఉన్న ప్రాంతాన్ని చుట్టుముట్టి కాల్పులు జరిపాయి. ఇదే జిల్లాలో ఈ నెల 12న జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మహిళా నక్సల్స్‌తోపాటు ఐదుగురు నక్సలైట్లు మరణించారు.