Mahaa Daily Exclusive

  అన్నారంలో ప్రారంభమైన ఉర్సు ఉత్సవాలు…!

Share

అన్నారంలో ప్రారంభమైన ఉర్సు ఉత్సవాలు
-150మంది పోలిసులతో భద్రత ఏర్పాట్లు
-హాజరుకానున్న పలువురు ప్రజాప్రతినిధులు
-రెండు రోజుల పాటు కోనసాగనున్న ఉర్సుల ఉత్సవాలు
-ఏర్పాట్లు పూర్తి చేసిన వక్ బోర్డు అధికారులు
-తప్పిపోయిన వారి కోసం ప్రత్యేక కంట్రోల్ రూం
వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం అన్నారం లో ఉర్సుల ఉత్సవాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. దర్గా పరిసరా ప్రాంతాలను కలర్ లైటింగ్ తో దర్గా ఆవరణలో సందడి నెలకొంది.ప్రతి ఏటా మూడు రోజుల పాటు జరిగే దర్గా ఉత్సవాలకు రాష్ట్ర మూలాల నుంచి భక్తులు వచ్చి యాకుబ్ షావళిని దర్శించుకోని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.దింతో దర్గాకు వచ్చే భక్తులకు ఎలాంటి లోపాలు జరగకుండా వక్ బోర్డు అధికారులు అన్ని సౌకర్యాలు కల్పించారు.ఏలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలిసులు 52 సిసి కెమెరాలతో పర్యవేక్షణ చేస్తున్నారు.150మంది పోలిసు సిబ్బంది బందోబస్తు ఏర్పాటు చేశారు.మూడు రోజుల పాటు అంగరంగ వైభవంగా జరిగే ఉత్సవాలకు పలువురు ప్రజాప్రతినిధులు హాజరుకానున్నారు.తప్పిపోయిన వారి ఆచూకి తెలపడం కోసం దర్గా ఆవరణలో ప్రత్యేక కంట్రోల్ రూం ను ఏర్పాటు చేశారు.ఈరోజు గంధం, 17వ తేదిన దీపారధన 18న ఖత్ మేఖ్ రాన్ జరగనున్నట్లు వక్ బోర్డు అధికారులు తెలిపారు.ఈ రోజు గంధం రాకతో దర్గా ఆవరణలో భక్తులు కిటకిటలాడుతున్నారు