గన్నవరం మండలం, కొండపావులూరు గ్రామంలో నూతనంగా నిర్మించిన జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ (NIDM) మరియు జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (NDRF) 10వ బెటాలియన్ ప్రాంగణం ఈనెల 19వ తేదీన ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమానికి కేంద్ర హోం మంత్రి శ్రీ అమిత్ షా ముఖ్య అతిథిగా కానున్నారు.
ఈ పర్యటనకు రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు , ఉపముఖ్యమంత్రి శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ , మరియు ఇతర రాష్ట్ర మంత్రులు హాజరుకానున్నారు. ఈ ముఖ్య కార్యక్రమం సజావుగా జరిగేందుకు ఏలూరు రేంజ్ ఐజి శ్రీ జి.వి.జి. అశోక్ కుమార్ ఐపీఎస్ , మరియు జిల్లా ఎస్పీ ఆర్. గంగాధర రావు ఐపీఎస్ మరియు ఇతర అధికారులతో కలిసి బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షించి పోలీసు అధికారులకు పలు సూచనలు జారీ చేశారు.
Post Views: 44








