కాళేశ్వరం అవకతకల విచారణకు ఏర్పడిన కమిషన్ ముందు రాష్ట్ర ఆర్ధికశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ రామకృష్ణారావు సమావేశమయ్యారు. కాళేశ్వరం కార్పొరేషన్ – లోన్స్ – ప్రాజెక్టు డిజైన్ లు, బడ్జెట్ కేటాయింపుల అంశాలపై కమిషన్ ప్రశ్నల వర్షం కురిపించింది. కార్పొరేషన్ కు నిధులు ఎలా సమకూర్చారని కమిషన్ ప్రశ్నించింది. కార్పొరేషన్ ద్వారా రెవెన్యూ ఎలా జనరేట్ చేస్తారని కమిషన్ ప్రశ్నించింది. డిజైన్ల విషయంలో నిబంధనలు పాటించారా అని కమిషన్ ప్రశ్నించగా, కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్ల బాధ్యత ప్రభుత్వానిదేనని రామకృష్ణ రావు పేర్కొన్నారు. డిజైన్లను అప్రూవల్ చేసే సమయంలో నిబంధనలు పాటించలేదని, కమిషన్ వ్యాఖ్యానించింది. ప్రాజెక్టు నిర్మాణ విషయంలో కోర్ కమిటీ రికార్డులు లేవని కమిషన్ ముందు రామకృష్ణ రావు స్పష్టం చేశారు. ప్రాజెక్ట్ తొందరగా కట్టారు కానీ నిబంధనలు పాటించలేదని,
కాళేశ్వరం ప్రాజెక్టు లక్ష్యం – రెవెన్యూ జెనరేట్ ఎలా చేస్తారు? అని కమిషన్ ప్రశ్నించింది. పరిశ్రమలకు నీళ్లు అమ్మి రెవెన్యూ జనరేటర్ చేయడమే ప్రాజెక్ట్ లక్ష్యమని రామకృష్ణ రావు వివరణ ఇచ్చారు. అసెంబ్లీలో కాళేశ్వరం ప్రాజెక్టు ఫిజికల్ పాలసీస్ పెట్టలేదని రికార్డులను కమిషన్ చూపింది. ప్రాజెక్టుకు సంబంధించిన ఫైల్స్ ప్రాపర్ గా క్యాబినెట్ ముందుకు రాలేదని, నిధుల విడుదల విషయంలో బిజినెస్ రూల్స్ పాటించలేదని కమిషన్ పేర్కొంది. రామకృష్ణారావుకు నిబంధనలు పాటించని అంశాల రికార్డులను చూపించడంతో ఆయన అంగీకరించారు. ఆర్థిక పరమైన అంశాల్లో రికార్డులను మైంటైన్ చేయలేదని కమిషన్ పేర్కొనగా, ప్రాజెక్టు కోసం ప్రభుత్వం గ్యారెంటీ తోటే లోన్స్ కార్పొరేషన్ తీసుకుందని, ప్రతి ఏడాదికి ప్రిన్సిపల్ అమౌంట్ తో కలిపి 7300 కోట్ల రూపాయలు వడ్డీ కడుతున్నామన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కోసం తీసుకున్న లోన్స్ కి 9నుంచి 10.5 శాతం వడ్డీతో రీ పేమెంట్ చేస్తున్నామని వెల్లడించారు.
కాళేశ్వరం ముందుకు ఏజెన్సీ సంస్థలు
కాళేశ్వరం కమిషన్ ముందుకు ఏజెన్సీ సంస్థలు రానున్నాయి. బుధవారం నుంచి వరసగా మూడు రోజులు పాటు ఏజెన్సీ సంస్థలను కాళేశ్వరం కమిషన్ విచారించనుంది. కమిషన్ ముందుకు మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల నిర్మాణ సంస్థలు రానున్నాయి. బుధవారం నవయుగ, గురువారం ఎల్ & టీ, శుక్రవారం అఫ్కాన్స్
ఏజెన్సీ సంస్థలు విచారణకు రానున్నాయి








