ప్రభుత్వం, ఉద్యోగులు వేరు కాదని, కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వమని, న్యాయబద్ధంగా రావాల్సిన అన్ని సదుపాయాలను కల్పిస్తామంటూ మంత్రి సీతక్క భరోసా ఇచ్చారు. బుధవారం సచివాలయంలో తన చాంబర్ లో తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ క్యాలెండర్ ను ఆమె ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రజా పాలన లక్ష్యాలను ప్రజలకు చేరవేయాల్సింది ప్రభుత్వ ఉద్యోగులేనని, ఉద్యోగాన్ని బాధ్యతగా నిర్వర్తించాలని వారికి సూచించారు. అందరూ బాగా పనిచేయాలని, మహిళలకు సత్వర సేవలందించేందుకు అధికారులు ముందుండాలన్నారు. ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని ఉద్యోగులకు మంత్రి సూచించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు అకేశ్వరరావు, సెక్రటరీ షబానా, ఆర్గనైజింగ్ సెక్రటరీ జ్యోత్స్న, ఇతర అధికారులు పాల్గొన్నారు.
Post Views: 61







