Mahaa Daily Exclusive

  సివిల్స్ 2025 నోటిఫికేషన్ విడుదల…!

Share

సివిల్స్ 2025 నోటిఫికేషన్ విడుదల

 

979 పోస్టులను గుర్తించిన యూపీఎస్సీ

 

– ఫిబ్రవరి 11 వరకు దరఖాస్తుల స్వీకరణ

 

ఢిల్లీ, మహా

సివిల్స్ సర్వీసెస్ ప్రిలిమినరీ ఎగ్జామ్ 2025కు సంబంధించిన నోటిఫికేషన్‌ను యూపీఎస్సీ బుధవారం విడుదల చేసింది. ఈ ఏడాది సుమారుగా 979 పోస్టులను భర్తీ చేయనున్నట్లు నోటిఫకేషన్‌లో పేర్కొన్నారు. ఆశావహులైన అభ్యర్థులు ఫిబ్రవరి 11లోగా ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకొని దరఖాస్తు చేసుకోవాలని తెలిపింది. అభ్యర్థులు upsconline.gov.inలో దరఖాస్తు చేసుకోవడానికి ముందు వన్ టైం రిజిస్ట్రేషన్ ప్రొఫైల్‌ను క్రియేట్ చేసుకోవాలని చెప్పింది. ఈ ఓటీఆర్ జీవితాంతం పని చేస్తుందని, ఇప్పటికే ఓటీఆర్ క్రియేట్ చేసుకున్న వాళ్లు నేరుగా అప్లికేషన్‌ను నింపుకోవచ్చని చెప్పింది. ఓటీఆర్‌లో తప్పులను సరి చేసుకోవడానికి అభ్యర్థులకు ఒక సారి అవకాశం ఇవ్వనున్నారు. ఫ్రెష్‌గా ఓటీఆర్ క్రియేట్ చేసుకున్న వారికి ఫిబ్రవరి 18 వరకు తప్పులను సరి చేసుకునే అవకాశం ఉంటుంది. అలాగే అప్లికేషన్లలో తప్పులను సరి చేసుకోవడానికి ఫిబ్రవరి 12 నుంచి 18 వరకు అవకాశం ఇస్తారు. ప్రిలిమినరీ ఎగ్జామ్‌ను మే 25న నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.