Mahaa Daily Exclusive

  జ‌న‌గ‌ణ‌న ఇంకెప్పుడు చేస్తారు..? కేంద్రాన్ని నిలదీసిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత…!

Share

జనగణనను కేంద్ర ప్రభుత్వం విస్మ‌రిస్తుంద‌ని ఎమ్మెల్సీ కల్వకుంట్ల క‌విత మండిప‌డ్డారు. జనాభా లెక్కలు లేకుండా ప్రగతి ఎలా సాధ్యమవుతుంది..? అని ప్ర‌శ్నించారు. జనాభా లెక్కలు లేమితో వృద్ధికి ఆటంకం క‌లుగుతుంద‌న్నారు. జనాభా లెక్కలు లేకుండా దేశ సామాజిక, ఆర్థిక పరిస్థితి ఎలా తెలుస్తుంది..? అని అడిగారు. ప్రగతిశీల విధానాలకు జనాభా లెక్కలు తప్పనిసరి ఆమె పేర్కొన్నారు. జ‌నగణనపై కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేయాలని ఎమ్మెల్సీ క‌విత డిమాండ్ చేశారు. మరోవైపు కులగణన లెక్కలు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో తెలంగాణ జాగృతి నేతలతో ఆమె సమావేశమై చర్చించారు.

Latest