టిపిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పిలుపుతో రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కదం తొక్కాయి. కేంద్ర బడ్జెట్ లో రాష్ట్ట్రానికి జరిగిన అన్యాయంపై ప్రశ్నించాయి. తెలంగాణకు గుండుసున్నా ఎందుకుపెట్టారంటూ నిలదీశాయి. పిసిసి ఆదేశాల మేరకు నిజామాబాద్ నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కేశ వేణు ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించగా, మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్ ఆధ్వర్యంలో భారీ నిరసన చేపట్టారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో నిరసన నిర్వహించగా, కేంద్ర బడ్జెట్‌పై కాంగ్రెస్ పార్టీ ములుగు జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్ విరుచుకుపడ్డారు.
కాంగ్రెస్ పార్టీ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్చార్జి వినయ్ రెడ్డి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ నిరసన కార్యక్రమాలు జరిగాయి.








