Mahaa Daily Exclusive

  కట్నం కోసం వేధిస్తున్న సీఐ సీపీకి ఫిర్యాదు చేసిన భార్య…!

Share

వరకట్నం తీసుకోవడం చట్ట విరుద్ధం. తీసుకున్నా ఇచ్చినా నేరం. నేరాలను నివారించి సమాజాన్ని సన్మార్గంలో పెట్టాల్సిన పోలీసులే దారి తప్పి చట్ట విరుద్ధమైన పనులకు దిగడంతో పోలీసు శాఖపై తీరని మచ్చ పడుతోంది. అబిడ్స్ పోలీస్ స్టేషన్లో జిటెక్టివ్ ఇన్ స్పెక్టర్ గా నరసింహ పని చేస్తున్నారు. ఇతడు గత కొన్నాళ్ళుగా కట్టుకున్న భార్యను అదనపు కట్నం కోసం వేధింపులకు గురి చేస్తున్నాడు. తాను కోరినంత కట్నం పుట్టింటి నుంచి తీసుకు రావాల్సిందే అంటూ శారీరకంగా, మానసికంగా చిత్రహింసలకు గురి చేస్తున్నాడు. పోలీసు శాఖలో బాధ్యత కలిగిన పదవిలో ఉంటూ వేధింపులకు గురి చేయడంతో విసుగు చెందిన భార్య సంధ్య భర్తపై పోలీసు కమిషనర్ ను ఆశ్రయించి తనకు న్యాయం చేయాలని అభ్యర్థించారు. తనకు నర్సింహతో 12 ఏళ్ళ క్రితం పెళ్లైందని, ఇద్దరు పిల్లలున్నారని, పెళ్ళై ఇన్నాళ్ళైనా, సంతానం కలిగినా భర్త పరివర్తనలో మార్పు రాకపోగా వేధింపులు రోజురోజుకూ తీవ్రమవుతున్నాయని తన ఆవేదనను వెలిబుచ్చుకుంది. కోరిన కట్నం తీసుకు రాకపోతే రెండవ పెళ్ళి చేసుకుంటానని బెదరిస్తున్నాడని పేర్కొంది బాధిత మహిళ. తనకు పాప పుట్టినపుడు పుట్టింటి వారి నుంచి లక్షన్నర నగదుతో పాటు తులం బంగారం తీసుకున్నాడని, అయినా ఇంకా కావాలంటూ నిత్యం నరకం చూపిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది. ఫిర్యాదును అందుకున్న కమిషనర్ శాఖాపరమైన విచారణతో పాటు సదరు డీఐ పై కేసు నమోదు చేయాలని ఆదేశించారు.

Latest