Mahaa Daily Exclusive

  ఎంపీ ఈటల రాజేందర్​పై విచారణ జరుపుతాం : మంత్రి కొండా సురేఖ

Share

త బీఆర్​ఎస్ ​పదేళ్ల పాలనలో దేవాదాయ శాఖ భూములు కబ్జా అయ్యాయని, ఆ పార్టీ నాయకులే ఎక్కువగా చేసినట్లు సమాచారం ఉందని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేవాలయ భూములపై త్వరలో ఈటెల రాజేందర్ పై విచారణ జరుగుతుందని తెలిపారు. మంగళవారం ఆయన మీడియాతో నిర్వహించిన చిట్​చాట్ లో పేర్కొంటూ సమగ్ర కుటుంబ ఇంటింటి సర్వే పై కేటీఆర్ వ్యాఖ్యలపై మంత్రి మండిపడ్డారు. రీ సర్వే చేయాలంటే ముందుగా ఆయన కుటుంబం దరఖాస్తు చేసుకోవాలని, రీ సర్వే అంటున్న కేటీఆర్ తన చెల్లి కవితను చూసి నేర్చుకోవాలని హితువు పలికారు. సర్వే, ప్రొఫార్మా లో ఎక్కడ తప్పులు జరిగాయో చెప్పాలని, ఎమ్మెల్యేలలో అసంతృప్తి అనేది నాకు తెలీదని తాను ఎవరిని ప్రోత్సహించడం లేదన్నారు. దేవాదాయ శాఖలో ఉద్యోగుల కొరత ఉందని, దీంతో పరిపాలన పరమైన ఇబ్బంది అవుతుందని, రెవెన్యూ నుంచి ఉద్యోగులను తీసుకోవడం ఇప్పుడు కొత్తేమి కాదని స్పష్టం చేశారు. న్యాయ పరమైన చిక్కులు లేని వాటిని మొదటి దశలో సర్వే చేయాలని ఆదేశించినట్లు చెప్పారు. రాష్ట్రంలో ఎక్కడెక్కడ కుంబాబిషేకాలు చేయాలో జాబితా సిద్ధం చేయాలని ఆదేశాలు ఇచ్చామని, కాళేశ్వరంలో కుంభాభిషేకం చేయక 42 ఏళ్లు అవుతుందన్నారు. ఫారెస్ట్ లో సర్వేయర్ల ప్రొటెక్షన్ పై ఎలాంటి ఫిర్యాదులు లేవన్నారు. బీసీ రిజర్వేషన్ల సర్వే తో మాకు మంచి పేరు వస్తోందనే కుట్రతో బీఆర్​ఎస్​ నేతలు ఓర్వలేక విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. బిసి రిజర్వేషన్ల విలువ ఇప్పుడే అర్థం కాదని, ఉద్యోగాలు, ఇతర అంశాల్లో బీసీలకు న్యాయం జరుగుతుందని వెల్లడించారు.

Latest