Mahaa Daily Exclusive

  మా రేవంతన్న కష్టం మామునూరు ఎయిర్ పోర్ట్ వరంగల్ జిల్లా ప్రజల అదృష్టమిది మంత్రి కొండాసురేఖ హర్షం..!

Share

వరంగల్ జిల్లాలోని మామునూరు ఎయిర్‌పోర్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జిల్లా వాసులకు దశాబ్ద కాలం కోరిక నేరవేరిందని తెలంగాణ రాష్ట్ర అటవీ పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అభిప్రాయపడ్డారు. ఇది తమ సీఎం రేవంతన్న, ఉన్నతాధికారులు స్థానిక ప్రజాప్రతినిధులు, వరంగల్ జిల్లా ప్రజల అదృష్టమని ఆమె వ్యాఖ్యానించారు. వరంగల్ జిల్లా వాసులు గాల్లో తేలే వార్త ఇది అని పేర్కొన్నారు. ఓరుగల్లు వాసులు ఎళ్ల తరబడి ఎదురుచూస్తున్న కలను నెరవేర్చే దిశగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వేగంగా అడుగులు వేసింది అన్నారు. మామునూరు ఎయిర్ పోర్టు నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చాక మంత్రి కొండా సురేఖ శుక్రవారం మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. మమునూరు ఎయిర్ పోర్టు నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం హర్షణీయం అన్నారు. తమ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ అంశంపై తీవ్రంగా చేసినట్టు చెప్పారు. మామునూరు విమానాశ్రయాన్ని అతి త్వరగా అందుబాటులోకి తీసుకురానున్నట్టు ఆమె వెల్లడించారు.