ఇవాళ ప్రవేశపెట్టిన తెలంగాణ బడ్జెట్‌పై కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందించారు. ఈ బడ్జెట్‌ను పరిశీలిస్తే అంతా డొల్ల అని తేలిపోయిందని ఆయన విమర్శించారు. బడ్జెట్ తీరును విశ్లేషిస్తే.. అబద్దాలు.. అంకెల గారడీ.. 6 గ్యారంటీలకు పాతరేసేలా ఉందని, ఓం భూం బుష్ అంటూ మాయ చేసేందుకే ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. గత బడ్జెట్ కేటాయింపులు, ఖర్చులను పరిశీలిస్తే పొంతనే లేదని, అయినప్పటికీ బడ్జెట్ కేటాయింపులు పెంచి రాష్ట్ర ప్రజలను దారుణంగా మోసం చేస్తున్నారన్నారు.
Post Views: 24








