పద్మశ్రీ వనజీవి రామయ్య దశదినకర్మ సందర్భంగా మూడువేల మొక్కలు, జ్యూట్ బ్యాగులు అందించిన బొడ్డుపల్లి రమేష్ గౌతమి దంపతులు
మూడువేల పండ్ల మొక్కలతోపాటు జూడ్ బ్యాగులను పద్మశ్రీ మన జీవి రామయ్య మనవరాలు బొడ్డుపల్లి గౌతమి రమేష్ అందించారు. ఇటీవల పద్మశ్రీ వనజీవి రామయ్య గుండెపోటుతో మృతి చెందగా ఆయన దశాదినకర్మను గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మనవరాలు బొడ్డుపల్లి గౌతమి రమేష్ తాత పర్యావరణహితంపై చూపిన శ్రద్ధను కొనసాగింపుగా మూడువేల జ్యూట్ బ్యాగులను, పండ్ల పూల మొక్కలను అక్కడికి వచ్చిన వారికి అందించారు. దశాదినకర్మకు వచ్చిన ప్రతి ఒక్కరూ ఆ మొక్కలను తీసుకొని సంతోషం వ్యక్తం చేశారు. పర్యావరణంపై ఆ కుటుంబానికి ఉన్న శ్రద్ధను కొనియాడారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన రాజకీయ ప్రముఖులు అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు.
Post Views: 69








