Mahaa Daily Exclusive

  ఉగ్రవాదాన్ని మట్టుపెట్టడానికి టీడీపీ ఫుల్ సపోర్ట్: MP లావు శ్రీకృష్ణదేవరాయలు

Share

ఉగ్రదాడిని ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలపై జరిగిన అఖిలపక్ష సమావేశంలో ఇంటలిజెన్స్ బ్యూరో డైరెక్టర్ దీక్షిత్ వివరణ ఇచ్చారని టీడీపీ నేత శ్రీకృష్ణదేవరాయలు తెలిపారు. ఈ సమావేశంలో తీవ్రవాదం, జాతీయ భద్రత అంశాల్లో అన్ని పార్టీలు రాజకీయాలకు అతీతంగా కేంద్రానికి మద్దతు తెలిపాయని ఆయన పేర్కొన్నారు. జాతీయ భద్రతపై తీసుకునే ఏ చర్యకైనా టీడీపీ పూర్తిగా మద్దతుగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.