మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ని రాజకీయాలలో లేకుండా చేస్తామని జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. వైసీపీ త్వరలోనే కుప్పకూలిపోతుందని ఆయన జోస్యం చెప్పారు. వచ్చేసారి వైసీపీకి ఈ 11 సీట్లు కూడా రావని అన్నారు. సిమెంట్ పరిశ్రమల నుంచి వైసీపీ నేతలు లబ్ధి పొందారని, జమ్మూకశ్మీర్ ముష్కరుల కంటే ఇక్కడ ఉన్న వాళ్లు చాలా డేంజర్ అని ఆదినారాయణ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు.
Post Views: 117








