సింధు నదిలో భారతీయుల రక్తం పారుతుందని పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ చీఫ్, మాజీ విదేశాంగ శాఖ మంత్రి బిలావర్ భుట్టో అన్నారు. సుక్కూర్ సభలో ఆయన భారత్‌ను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. ‘పహల్‌గామ్ ఘటనకు పాక్‌ను దోషిని చేస్తున్నారు. వారి నిస్సహాయతను కప్పిపుచ్చుకునేందుకు మనల్ని నిందిస్తున్నారు. అకారణంగా సింధు నదీ జలాలు నిలిపివేశారు. అందులో నీరు ప్రవహించినా, లేదా వారి రక్తం ప్రవహించినా సింధు నది మనదే’ అని భుట్టో అన్నారు.
Post Views: 106








