Mahaa Daily Exclusive

  ఉద్యోగ విరమణ పొందిన పోలీస్ అధికారులకు సన్మానం ..!

Share

ఖమ్మం – మహా.
ఉద్యోగ విరమణ పొందిన పోలీస్ అధికారులకు పోలీస్ కమిషనర్ సునీల్ దత్ పూలమాలలు, శాలువలతో ఘనంగా సన్మానించారు. పోలీస్ కమిషనర్ కార్యాలయంలో జరిగిన సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ .. సుదీర్ఘ కాలంగా వివిధ విభాగాలలో భాద్యతయుతమైన విధులు నిర్వహించి పోలీస్ శాఖ కు ఎనలేని సేవలతో పోలీస్ అధికారుల మన్ననలు పొందారని పోలీస్ కమీషనర్ కొనియాడారు. విధినిర్వహణలో తోడ్పాటు అందించిన కుటుంబ సభ్యులను ఈ సందర్భంగా అభినందించారు. పదవి విరమణ చేసిన మీరు ఇకపై కుటుంబ సభ్యులతో అనందంగా వారి భావి జీవితం ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో గడపాలని ఆకాంక్షించారు.

ఉద్యోగ విరమణ పొందిన వారు
. దానయ్య పిసిఆర్ ఖమ్మం.
.నాగరాజు ఖమ్మం త్రీ టౌన్ పిఎస్.
. కాంచన దేవి ( సీపీ కార్యాలయం)

ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ ఆడ్మీన్ నరేష్ కుమార్, అడిషనల్ డీసీపీ లా& ఆర్డర్ ప్రసాద్ రావు, కామరాజు,పోలీస్ అసోసియేషన్ ఇంచార్జి అధ్యక్షుడు వేంకటేశ్వర్లు పాల్గొన్నారు.