ఆదిలాబాద్, మహా : ఇటీవల తర్నం వాగులో గల్లంతయి మృతి చెందిన లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన లాండె దత్తు మరణానికి ఎమ్మెల్యే పాయల్ శంకర్ , మాజీ మంత్రి జోగు రామన్నలే కారణమని ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇంచార్జి కంది శ్రీనివాస రెడ్డి ఆరోపించారు.సోమవారం జైనథ్ మండలం లక్ష్మీ పూర్ గ్రామంలోని మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించి ఆర్థిక సాయాన్ని అందించారు. గతంలోనే వంతెన పూర్తయితే ఈ ప్రమాదం జరిగేది కాదని బ్రిడ్జి నిర్మాణంలో నిర్లక్ష్యం వహించిన అప్పటి ఎమ్మెల్యే జోగు రామన్న, ప్రస్తుతం రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్న సమయంలో బ్రిడ్జి ప్రక్కన తాత్కాలిక వంతెన విషయంలో నిర్లక్ష్యం చేసిన కేంద్రంలో అధికార బీజేపీ కి చెందిన ఎమ్మెల్యే పాయల శంకర్ ల నిర్లక్ష్యం వల్లే ఈ ఘోరం జరిగిందన్నారు.ఇది ప్రమాదం కాదని ముమ్మాటికి వారిద్దరూ చేసిన హత్య అన్నారు.మరోవైపు పనులు దక్కించుకున్న గుత్తేదారు కూడా కారణమన్నారు. తక్షణమే మృతుని కుటుంబానికి రూ. 50లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. ఆయన వెంట మాజీ ఏఏంసీ చైర్మన్ మునిగెల విటల్,లోక ప్రవీణ్ రెడ్డి,రఫీక్, ఎంఏ షకీల్,డేరా కృష్ణారెడ్డి, అంజాద్,గ్రామస్తులు మహిపాల్ రెడ్డి, ఎల్టీ అశోక్ రెడ్డి,ఏనుగుందుల నర్సిములు, కదరాపు నారాయణ, దాసరి నారాయణ, గడ్డo నారాయణ రెడ్డి ,అడ్డి రాజారెడ్డి.తదితరులు పాల్గొన్నారు.







