Mahaa Daily Exclusive

  కల్యాణ వేడుకలో పాల్గొన్న కంది మౌనా శ్రీనివాస రెడ్డి..!

Share

ఆదిలాబాద్, మ‌హా :

పెళ్లిళ్ల సీజన్ లో కళ్యాణ వేదికలన్నీ కళకళలాడుతున్నాయి. ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇంచార్జి కంది శ్రీనివాస రెడ్డి పై అభిమానంతో తనను ఆహ్వానించిన వారి వివాహాది శుభకార్యాలకు ఆయన తన శ్రేణులతో కలిసి హాజరవుతుంటారు. శుక్ర‌వారం కంది శ్రీ‌నివాస రెడ్డి త‌ర‌పున ఆయ‌న‌ స‌తీమ‌ణి కంది మౌనా శ్రీ‌నివాస రెడ్డి త‌న కుటుంబ స‌భ్యుల‌తో హాజ‌రై కళ్యాణ మండపాలలో బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు అభిమానులను ఆప్యాయంగా పలకరించారు. పట్టణంలోని వి.ఎన్.ఆర్ గార్డెన్ లో జ‌రిగిన శ్రేయ రెడ్డి , సంతోష్ రెడ్డి వివాహ వేడుకలకు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించి కంది శ్రీనన్న పెళ్లి కానుకను బహుకరించారు.