రంగారెడ్డి జిల్లా ప్రతినిధి మహా:
కేంద్ర ప్రభుత్వం ఏర్పడి 11 సంవత్సరాల కాలంలో ప్రజలకు అందించిన సంక్షేమ పథకాలు, కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని రాష్ట్ర నాయకులు అన్నారు. శుక్రవారం వైష్ణవి గార్డెన్లో ఇబ్రహీంపట్నం మండల అధ్యక్షుడు గోదాల శేఖర్ రెడ్డి అధ్యక్షతన, మండల కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కడారి జంగయ్య యాదవ్, బోసుపల్లి ప్రతాప్ ముఖ్యఅతిథిగా హాజరై, సమావేశంలో కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ… స్థానిక సమస్యలపై చర్చించడం జరిగింది. అమలు కాని ఆరు గ్యరంటీల పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేశారని, అమలు గాని పథకాలను ప్రజలకు వివరించి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎండగట్టాలని తెలిపారు. బిఆర్ఎస్ ప్రభుత్వ గత 10 ఏళ్ల పాలనలో మోసం చేసిన తీరును ప్రజల్లోకి తీసుకపోవాలని కార్యకర్తలకు ఆయన సూచించారు. కేంద్ర ప్రభుత్వం ఏర్పడిన11 సంవత్సరాలలో మోడీ ప్రభుత్వం పేద ప్రజలకు చేసిన సంక్షేమ పథకాలు, ప్రజలకు అందిన పథకాలను గ్రామాలలోని ప్రజలకు వివరించాలని సూచించారు. రాష్ట్ర నాయకులు బోసుపల్లి ప్రతాప్ మాట్లాడుతూ… స్థానిక సంస్థల ఎన్నికలను ఎదుర్కోవడానికి కార్యకర్తలు అందరూ తయారుగా ఉండాలని కోరారు. అదేవిధంగా పోరెడ్డి అర్జున్ రెడ్డి మాట్లాడుతూ… ఆపరేషన్ సింధూర్ ద్వారా భారత్ ప్రపంచ దేశాలలో శక్తివంతమైన దేశంగా గుర్తించబడింది అని అన్నారు. ఈ కార్యక్రమంలో దొండ రమణారెడ్డి, దండే శ్రీశైలం, బాలశివుడు, శ్రీనివాస్ రెడ్డి, విట్టల్ రెడ్డి, బూత్ అధ్యక్షులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.








