వరంగల్ మహా;
వరంగల్ తూర్పు నియోజకవర్గం
22వ డివిజన్ లోని కాలనీ వాసుల కల కమ్యూనిటీ హాల్ కలగానే మిగిలిపోయింది. వారి అభ్యర్థన మేరకు కొన్ని సంవత్సరాలుగా ఫంక్షన్స్, ఇతర కార్యక్రమాలు చేయాలనుకునే పేద మధ్యతరగతి ప్రజల బాధలను గుర్తించి ఈ విషయాన్ని స్థానిక కార్పొరేటర్ బస్వరాజు కుమారస్వామి మంత్రి కొండా సురేఖ, మాజీ ఎమ్మెల్సీ మురళీధర్ దృష్టికి తీసుకురాగా వెంటనే స్పందించి కమ్యూనిటీ హాల్ కు 50 లక్షల నిధులు మంజూరు చేయగా శుక్రవారం గ్రేటర్ వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి, స్థానిక కార్పొరేటర్ బస్వరాజు కుమారస్వామి ఆధ్వర్యంలో నిర్వహించిన ఎస్సీ కమ్యూనిటీ హాల్ శంకుస్థాపన కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావు విచ్చేసి కొబ్బరికాయలు కొట్టి ప్రారంభించారు.
అనంతరం మేయర్ మాట్లాడుతూ ఈ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి మున్సిపల్ నుండి నా వంతు నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ మాట్లాడుతూ అన్ని కులాలకు సంబంధించిన కమ్యూనిటి హల్ నిర్మాణం చేపట్టామని ఇది ఎంతో సంతోషకరమైన ఈ కార్యక్రమాన్ని చేస్తున్నామని మంత్రి కొండా సురేఖ సారథ్యంలో మేమందరం చేయడం జరిగిందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు సురేష్ జోషి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు గోపాల్ నవీన్ రాజ్, సయ్యద్ వసీం, తోట వేణు, మాజీ కార్పొరేటర్లు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.








