వరంగల్ మహా;
రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్ డాక్టర్ బండా ప్రకాష్ ముదిరాజ్ తో కలిసి వరంగల్ జిల్లా నెక్కొండ మండలం సూరిపల్లిలో శ్రీశ్రీశ్రీ పెద్దమ్మ దేవి అమ్మ వారి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవానికి హాజరయ్యారు. శ్రీశ్రీశ్రీపెద్దమ్మ దేవి, పెద్దిరాజు స్వామి వారి విగ్రహాల ప్రతిష్ఠ సందర్భంగా గ్రామంలో ఈనెల 4వతేదీన ఉత్సవాలు ప్రారంభమయ్యాయి.ఈ మహోత్సవంలో భాగంగా శుక్రవారం ఉదయం పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం డోలు, డప్పు వాయిద్యాలు, నృత్యాలు,వేద మంత్రాలు, వేలాది మంది భక్తుల మధ్య ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఎంపీ రవిచంద్ర, మండలి డిప్యూటీ ఛైర్మన్ ప్రకాష్ లు అమ్మ వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేద పండితులు వారికి ఆశీర్వచనాలు పలికి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ గ్రామస్తులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. పెద్దమ్మ తల్లి కరుణాకటాక్షాలు సూరిపల్లి వాసులపై ఎల్లప్పుడూ ఉండాలని, వానలు సమృద్ధిగా కురిసి పాడిపంటలతో సుభిక్షంగా వర్థిల్లాలని వారు ఆకాంక్షించారు. ఈ మహోత్సవానికి ముఖ్య అతిథులుగా హాజరైన ఎంపీ రవిచంద్ర, శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్ ప్రకాష్ లకు ఆలయ కమిటీ అధ్యక్షుడు దుండి శ్రీనివాస్, మాజీ సర్పంచ్ సింగారపు భాస్కర్ రాజు, కమిటీ సభ్యులు పిట్టల కొమ్మాలు,వేమ రమేష్, ప్రముఖుల ఆధ్వర్యంలో గ్రామస్తులు శాలువాలతో ఘనంగా సత్కరించారు.








