Mahaa Daily Exclusive

  మిల్స్ కాలనీ సీఐ గా బొల్లం రమేష్ నియామకం..!

Share

వరంగల్ మహా;

వరంగల్ మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ ఇన్స్ స్పెక్టర్ ఆఫ్ పోలీస్ గా బొల్లం రమేష్ ను నియమిస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో ఈ ఇన్స్పెక్టర్ రమేష్ నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలలో రెండు సంవత్సరాలు, ఇన్స్పెక్టర్ గా ఖమ్మం జిల్లా అశ్వాపురం, ధర్మసాగర్, హుజురాబాద్, కొత్తగూడెం సిసిఎస్ లో కూడా విధులు నిర్వహించారు. ప్రస్తుతం కరీంనగర్ కమిషనరేట్ లో టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ గా విధులు నిర్వహిస్తున్నారు. ఈ స్టేషన్ కు కొందరు పోటీ పడినప్పటికీ మరికొందరు వెనుకడుగు వేశారు. అయినప్పటికీ ఇలాంటి నియమ నిబద్ధత కలిగిన పోలీస్ ఆఫీసర్ ను మీల్స్ కాలనీ ఇన్స్పెక్టర్ గా పోలీస్ కమిషనర్ నియమించడం పోలీస్ వర్గాల్లోనూ ఇటు వరంగల్ తూర్పులో చర్చనీయాంశమైంది. ప్రస్తుతం ఈయన కరీంనగర్ జిల్లా నుంచి వరంగల్ జిల్లా తూర్పు నియోజకవర్గం లోని మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ కు ఇన్స్పెక్టర్ గా బదిలీ అయ్యారు.