Mahaa Daily Exclusive

  సూపర్ సిక్స్ సూపర్ ప్లాప్: వైఎస్ షర్మిల

Share

AP: ఎన్డీయే కూటమి ప్రభుత్వం పై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఫైర్ అయ్యారు. కూటమి ఎన్నికల సమయంలో ఇచ్చిన ‘సూపర్ సిక్స్ సూపర్ ప్లాప్’ అంటూ ఆమె ఎద్దేవా చేశారు. అన్నదాత సుఖీభవ పథకాన్ని దుఃఖీభవా చేస్తున్నారని ఆమె ఆరోపించారు. రాష్ట్రంలో 93 లక్షల మందికి పైగా రైతులు ఉండగా.. అర్హత పేరుతో 47 లక్షల మందికే పథకం వర్తింపజేస్తారని ఆరోపించారు. ‘తల్లికి వందనం’ కింద కోతలేనని, 87 లక్షల మంది విద్యార్థులకు గాను.. 67 లక్షల మందికే ఇచ్చారన్నారు.