Mahaa Daily Exclusive

  మిమ్స్ డిగ్రీ కళాశాలలో జూన్ 30 న మినీ జాబ్ మేళా — మంచిర్యాల జిల్లా ఉపాధి కల్పనా శాఖ అధికారి రవికృష్ణ..!

Share

మంచిర్యాల మహా : మంచిర్యాల జిల్లా మిమ్స్ డిగ్రీ కళాశాలలో చదువుకున్న నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశం కల్పించడం కొరకు జూన్ 30 ఉదయం 10 గంటల 30 నిమిషాలకు మినీ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు మంచిర్యాల జిల్లా ఉపాధి కల్పన శాఖ అధికారి రవికృష్ణ ఒక ప్రకటనలో తెలిపారు. అపోలో ఫార్మసీ సంస్థలో 40 ఫార్మసస్ట్, 20 ట్రైనీ ఫార్మసిస్ట్ లు, 30 ఫార్మా అసిస్టెంట్ లు, 10 రిటైల్ ట్రైనీ అసోసియేట్స్ పోస్టులకు గాను హైదరాబాద్, మంచిర్యాల ప్రాంతాలలో పని చేసేందుకు ఎస్. ఎస్.సి, ఇంటర్ డి ఫార్మసీ, బి. ఫార్మసీ, డిగ్రీ అర్హత కలిగిన 18 నుండి 35 సంవత్సరాల వయసు గల పురుష అభ్యర్థులు సకాలంలో మినీ జాబ్ మేళాకు హాజరు కావాలని తెలిపారు. వివరాలకు 8247656356, 9121171671, 9110368501 నెంబర్లలో సంప్రదించాలని, ఈ అవకాశాన్ని ఆసక్తి అర్హత గల అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని రవి కృష్ణ కోరారు.

Latest