వరంగల్ మహా;
వరంగల్ నగరంలోని ఆర్ఎన్టీ రోడ్ లో గల ఆర్యవైశ్య పట్టణ సంఘాన్ని మొదట సందర్శించారు. ఈ సందర్భంగా గత సంఘం అధ్యక్షుడు గుండా ప్రకాష్ సంఘాన్ని అడ్డుపెట్టుకొని ఆయన చేసిన మోసాలు, సంఘాన్ని బ్రష్టుపట్టించిన తీరు, సంఘంలో జరిగిన భారీ అవకతవకలను సంఘం పెద్దలు కొండా మురళీధర్ రావు దృష్టికి తీసుకువచ్చారు. ఇందుకు ఆయన స్పందిస్తూ ఆర్యవైశ్య సంఘం పెద్దలతో మీరు కలిసికట్టుగా ఐకమత్యంతో ముందు మీరు ఒక కమిటీ వేసుకుని ముందుకు సాగండి, మీ వెంట నేను ఉన్నానంటూ వారికి భరోసా ఇస్తూ అన్యాయం జరిగిన బాధితులకు తప్పకుండా న్యాయం జరిగేలా ప్రస్తుత నిర్వాహకులు, సంఘం పెద్దలు, నాయకులు బాధ్యత తీసుకోవాలని సూచించారు. అనంతరం
ఆర్యవైశ్య సంఘం నాయకులు తమ సంఘం సమస్యలను మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి దృష్టికి తీసుకురావడం జరిగింది వెంటనే స్పందించిన మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి సమస్యలు విని తెలుసుకొని అక్కడికక్కడే కొన్ని సమస్యలను పరిష్కరించారు. భవిష్యత్తులో కూడా ఏమైనా సమస్యలు ఉన్నచో తమ దృష్టికి తీసుకొని వస్తే పరిష్కరిస్తామని, సంఘం అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామని ఈ సందర్భంగా కొండా మురళి హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా
జక్కులుద్దీన్ లోని ఎకరం భూమిని ఆర్యవైశ్య సంఘం భవన నిర్మాణానికి కేటాయిస్తామని మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావు హామీ ఇవ్వడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య పట్టణ సంఘం నిర్వాహకులు గట్టు మహేష్ బాబు, గోరంటల యాదగిరి, మాధంశెట్టి హరిబాబు, మధు, అనంతుల శ్రీనివాస్, తాటికొండ రాము, సంఘం నాయకులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు గోపాల్ నవీన్ రాజు,కొత్తపల్లి శ్రీనివాస్, మడిపల్లి కృష్ణ గౌడ్, మీసాల ప్రకాష్, కార్పొరేటర్లు, కంటెస్టెడ్ కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు కురిమిళ్ల సంపత్ కుమార్, ముఖ్య నాయకులు బొల్లం శివ, తోట నవీన్, మబ్బు ప్రవీణ్ కుమార్, మక్బూల్, మహిళా నాయకులు, యుత్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.








