Mahaa Daily Exclusive

  తోటి మిత్రుల కుటుంబాలకు కేవీ విద్యానికేతన్ పూర్వ విద్యార్థుల ఆర్థిక సహాయం..

Share

 

కారేపల్లి,మహ:ఖమ్మం జిల్లా సింగరేణి మండల పరిధిలోగల మాదారం కె.వి విద్యానికేతన్ పాఠశాలకు చెందిన పూర్వ విద్యార్థులు ఆపదలో ఉన్న తమ చిన్ననాటి స్నేహితుల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందజేశారు. ఆ పాఠశాలలో 2004లో 10వ తరగతి చదివిన రమేష్ తల్లి లక్ష్మి అనారోగ్య కారణంగా ఇటీవల మృతి చెందింది. మృతురాలు లక్ష్మి సంస్కరణ సభ శనివారం మాదారం గ్రామంలో జరిగింది. దీంతో ఆ పాఠశాల పూర్వ విద్యార్థులు ప్రముఖ వైద్యుడు బాదావత్ రవి, మాదారం గ్రామపంచాయతీ మాజీ సర్పంచ్ అజ్మీర నరేష్ తో పాటు పూర్వ విద్యార్థులు లక్ష్మి సంస్మరణ సభకు హాజరై నివాళులర్పించారు. మృతురాలి కుమారుడు తోటి మిత్రుడు రమేష్ కుటుంబానికి రూ.27వేల రూపాయలు ఆర్థిక సాయాన్ని అందజేశారు. అదేవిధంగా కొన్ని నెలల క్రితం గుంపెల్ల గూడెంలో అకాల మృతి చెందిన చిన్ననాటి స్నేహితుడు వీరన్న కూతురు పేరు మీద బ్యాంక్ లో రూ.1,10,000లు డిపాజిట్ చేశారు.అనంతరం తమ గురువు, కె.వి విద్యానికేతన్ పాఠశాల వ్యవస్థాపక కరస్పాండెంట్ కప్పెర రంగారావును పూర్వ విద్యార్థులంతా కలిసి సన్మానించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మారుమూల గ్రామీణ ప్రాంతమైన మాదారం కే.వి విద్యానికేతన్ లో విద్యను అభ్యసించిన పూర్వ విద్యార్థులు స్వదేశీ,విదేశాల్లో స్థిరపడి వాణిజ్య, వ్యాపార,రాజకీయ రంగాలలో రాణిస్తున్నారని గుర్తుకు చేశారు. భవిష్యత్తులో కూడా తోటి మిత్రులకు ఆపద వస్తే ఆదుకుంటామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు బోడా రమేష్ నాయక్,అజ్మీర సురేష్ నాయక్,బట్టు వీరు, బాలు,లచ్చు,బానోత్ నాగేష్,దుంపటి గోవిందు, పోతనబోయిన ఉమారావు, రాంబాబు,అజ్మీర రజిని తదితరులు పాల్గొన్నారు.