వరంగల్ మహా;
వరంగల్ అర్బన్ కో- ఆపరేటివ్ బ్యాంక్ లి., 29వ మహాజన సభ సమావేశం వరంగల్ నగరం దేశాయ్ పేట్ రోడ్డు లోని కేఆర్ గార్డెన్స్ నందు సంస్థ చైర్మన్ ఎర్రబెల్లి ప్రదీప్ రావు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా బ్యాంకు చైర్మన్, డైరెక్టర్లు మాట్లాడుతూ భవిష్యత్తుకు భరోసా వరంగల్ అర్బన్ కో-పరేటివ్ బ్యాంకు అని ఖాతాదారులకు మెరుగైన సేవలు అందిస్తూనే మా బ్యాంకు ద్వారా ఫోన్ పే, గూగుల్ పే, డెబిట్ కార్డ్ స్వైపింగ్ వంటి అనేక సేవలను కూడా అందుబాటులో తెచ్చామని తెలిపారు.
ఈ ఆర్థిక సంవత్సరం లో 14.24% వృద్ధితో డిపాజిట్లు రూ.219.20 కోట్లకు చేరినవని
రుణాల మంజారులో 13.20% వృద్ధిలో రూ. 154.13 కోట్లకు చేరి మొత్తం బిజినెస్ రూ. 373. 43 కోట్లకు చేరుకున్నాయి.
ఈ ఆర్థిక సంవత్సరములో స్థూల లాభం రూ. 3.03 కోట్లు కాగా అందులో రూ. 60.90 లక్షల ఆదాయపు పన్ను చెల్లించగా నికరలాభం రూ. 2.22 కోట్లు ఆర్జించింది. అలాగే
నిరర్థక ఆస్తులు ఈ ఆర్థిక సంవత్సరంలో స్థూల నిరర్థక ఆస్తులు 2.17% నీత నిరర్థక ఆస్తులు 0.791 ఉన్నాయని తెలుపటకు సంతోషిస్తున్నామని వారు పేర్కొన్నారు. అంతేకాకుండా
డిపాజిట్ దారులకు రిజర్వు బ్యాంకు నిబంధనల మేరకు డిఐసిజిసి ద్వారా రూ 5 లక్షల వరకు ఖాతాదారులకు ఇన్సురెన్స్ సౌకర్యం కూడా కలదని తెలిపారు. ముఖ్యంగా ఈ ఆర్థిక సంవత్సరంలో నూతనంగా 4 శాఖలను ప్రారంభించామని తెలుపుటకు సంతోషిస్తున్నామన్నారు. నూతనంగా ప్రారంభించిన బ్రాంచ్ ల వివరాలు గోపాల్ పూర్, మహబూబాబాద్, జనగాం, వడ్డేపల్లి, గా చైర్మన్ వెల్లడించారు. ఈ సందర్భంగా సంస్థ అభివృద్ధికి కృషి చేస్తున్న డైరెక్టర్లకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు చైర్మన్ ఎర్రబెల్లి ప్రదీప్ రావు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సమావేశంలో
బ్యాంకు వైస్ చైర్మన్ తోట జగన్నాథం, డైరెక్టర్లు వేణుగోపాల్ ముందడ, కూరపాటి చంద్రమౌళి , తోట సంపత్ కుమార్, మహమ్మద్ గౌసుద్దీన్, ఒడితర పవన్ కుమార్ , బొమ్మినేని పాపి రెడ్డి , పొన్న హరినాథ్, పోలేపాక రవికుమార్ , బండారి భార్గవి , మంద స్వప్న , నామినేట్ డైరెక్టర్లు అపరాజు రాజేంద్రకుమార్, పుల్లూరి సుధాకర్, బ్యాంకు ముఖ్య కార్యనిర్వాహణ అధికారి ఎం సత్యనారాయణ రావు, వరంగల్ డీసీఓ కోదండ రాములు, హన్మకొండ డీసీఓ సంజీవ రెడ్డి, ఏఆర్ అన్నమనేని జగన్మోహన్ రావు, సేల్స్ ఆఫీసర్ కె రవీందర్, తదితరులు పాల్గొన్నారు.








