హన్మకొండ మహా;
వరంగల్ పశ్చిమ నియోజకవర్గం లోని హన్మకొండ నగరంలోని కాంగ్రెస్ భవన్ లో ముఖ్య నాయకుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడుతు జులై 4వ తారీఖున ఏఐసిసి అధ్యక్షులు ఖర్గే హైదరాబాద్ వస్తున్నారని వారిని ఘనంగా స్వాగతించాలని, మన నియోజకవర్గం నుండి పెద్ద సంఖ్యలో నాయకులు కార్యకర్తలందరూ తరలి వెళ్లాలని ఇందుకు తగిన ఏర్పాట్లలో నిమగ్నమయై ఉండాలని ముఖ్య నాయకులందరికి దిశా నిర్దేశం చేశారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి గారితో పాటు DCC ప్రెసిడెంట్ ఎర్రబెల్లి స్వర్ణ, నియోజకవర్గ కార్పొరేటర్లు డివిజన్ ప్రెసిడెంట్లు ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Post Views: 37








