Mahaa Daily Exclusive

  కొండా వ్యాఖ్యల పై భగ్గుమన్న ఎమ్మెల్సీ ఎమ్మెల్యేలు అవకాశాన్ని బట్టి పార్టీలు మారడం కొండా మురళి కి పరిపాటే..!

Share

హన్మకొండ మహా;

హన్మకొండ నగరంలోని
పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి క్యాంప్ ఆఫీస్ లో ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, డిసిసి అధ్యక్షుల ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సమావేశంలో వారు మాట్లాడుతూ శనివారం
మాజీ ఎమ్మెల్సీ మంత్రి కొండా మురళి క్రమ శిక్షణ కమిటీకి తప్పుడు వివరాలు ఇచ్చి తప్పించుకోవాలని చూస్తున్నాడని కాంగ్రెస్ పార్టీని దెబ్బతీసేలా మాట్లాడి ఇప్పుడు అసలు విషయం తప్పుదోవ పట్టించాడని తెలిపారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా మాట్లాడడమే కాకుండా, కమిటీకి తప్పుడు వివరాలను ఇచ్చి మీడియా ఎదుట మళ్లీ ఎమ్మెల్యేల పై దురుసుగా మాట్లాడడం సరికాదన్నారు.
కొండా మురళి మారని పార్టీ లేదని అవకాశాన్ని బట్టి పార్టీలు మారడం వ్యక్తులను, లీడర్లను దూషించడం ఆయనకు పరిపాటేనని అన్నారు. ఆయన 38 ఏళ్లుగా అందరికి అండగా ఉంటూ పార్టీని కాపాడుతున్నాని చెబుతున్నారు కాని, కొండా దంపతులు ఇప్పటి వరకు టీడీపీ, కాంగ్రెస్, వైఎస్సార్ సీపీ, బీఆర్ఎస్ తో వరుసగా పార్టీలు మారుతూ వస్తున్నారని వారు ఎద్దేవా చేశారు. గత ఎన్నికల ముందే వారు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరారని గుర్తు చేశారు. వారు ఏనాడూ కాంగ్రెస్ పార్టీలో కుదురుగా లేరని ఉమ్మడి వరంగల్ జిల్లాలో అందరికంటే ఎక్కువ సార్లు పార్టీ మారింది వారే అని ఇక పార్టీలు మారడమే కాకుండా, పార్టీలోని శ్రేణులను, నమ్ముకున్న నాయకులను ఎదగనివ్వలేదని, పార్టీ పరిస్థితులను భ్రష్టుపట్టించడం వారి నైజమని తెలిపారు.
ఇక తాజాగా క్రమ శిక్షణ కమిటీ పిలువకుండానే తనంతటతానే గాంధీ భవన్ కు వచ్చి ఆయన వివరాలు ఆయనే సమర్పించానని మీడియా ముందు చెప్పారు కానీ నోటీసులు ఇచ్చిన విషయం చెప్పకుండా దాచి పెట్టారని క్రమ శిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి పిలుపు మేరకు వచ్చినప్పటికీ ఆయన మాత్రం తన గొప్పను చాటుకోవడానికి, మీడియాలో హైలెట్ కావడానికి క్రమ శిక్షణ కమిటీ పిలువలేదని చెప్పారు అసలు విషయం మల్లు రవి మాత్రం జూలై 5వ తేదీలోపు వివరణ ఇవ్వాలని ఆదేశించగా కొండా మురళి హైదరాబాద్లోని గాంధీభవన్ కు వచ్చారని అన్నారు.
ఆయన తీరు ఎప్పుడు ప్రజలను, పార్టీ నేతలను తప్పుదోవ పట్టించే తీరుగానే ఉంటుందని కొండా మురళి చేసిన ప్రకటన ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ నాయకుల మనోభావాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని మండిపడ్డారు. ఈ విషయాలను క్రమశిక్షణ కమిటీ గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. గతంలో
అనేక సార్లు ఎన్నికల్లో ఓడిపోయి ప్రజలకు, శ్రేణులకు దూరం అయ్యారు. ఓ మంత్రిగా ఉండి కూడా గత పార్లమెంట్ ఎన్నికల్లో స్థానిక నియోజకవర్గంలో పార్టీకి మెజార్టీ కూడా సాధించలేదని తామెన్నడూ ఓడిపోలేదని ఇప్పుడు ప్రగల్బాలు పలికుతున్నారు. 2012లో పరకాల ఉప ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా, 2018 కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలో నిలిచి ఓడిపోయారు. 2008లో కొండా సురేఖ ఎంపీ అభ్యర్థిగా ఓడిపోయారు. 2001లో కాంగ్రెస్ నుంచి జెడ్పీటీసీ సంగెం నుంచి బరిలో నిలిచి కొండా మురళి ఘోర పరాజయం చవి చూశారు. ఇక 2018 లో వరంగల్ తూర్పు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఉన్న కొండా దంపతుల ప్రవర్తన నచ్చక కేసీఆర్ మళ్లీ టికెట్ కేటాయించేందుకు నిరాకరించారని ఇది వారి కుటిల, రౌడీ రాజకీయాల్లోని గణచరిత్ర అని అన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే కాకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అనేక సార్లు పార్లమెంట్ సభ్యుడిగా, శాసన సభ్యుడిగా ఎన్నికై తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సొంతం చేసుకున్న రాంసాని సురేందర్ రెడ్డి పై పూర్తిగా తప్పుడు వార్తలు ప్రచారం చేయడం మానుకోవాలని వారు హెచ్చరించారు. 1996 లోక్ సభ ఎన్నికల్లో వరంగల్ పార్లమెంట్ నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా సరేందర్ రెడ్డి పోటీ చేసి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అజ్మీరా చందులాల్ చేతిలో ఓడిపోయారు.1996 ఎన్నికల తర్వాత సురేందర్ రెడ్డి ప్రత్యేక్ష రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారని ఆ తర్వాత ఆయన ఏ ఎన్నికల్లో పోటీ చేయలేదని అదేవిధంగా
2009లో నియోజకవర్గాల పునర్విభజన జరిగింది. వరంగల్ పార్లమెంట్ ఎస్సీలకు, మహబూబాబాద్ ఎస్టీలకు రిజర్వ్ అయిందని సురేందర్ రెడ్డికి నియోజకవర్గాల పునర్ విభజనలో సీటు లేకుండా చేశానని, అందుకే సురేందర్ రెడ్డి తమపై కక్షగట్టి ప్రస్తుత వరంగల్ ఇస్ చార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తో కలిసి ఇబ్బంది పెడుతున్నారని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. పునర్ విభజనకు ముందే (12ఏళ్ల) ఆయన రాజకీయాల నుంచి విరమణ తీసుకున్నారు. కాంగ్రెస్ పార్టీకి నిస్వార్థంగా సేవలందించిన సురేందర్ రెడ్డి పై ఇష్టమొచ్చినట్లు మాట్లాడడం కొండా మురళి చౌకబారు రాజకీయాలకు నిదర్శనమని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.