Mahaa Daily Exclusive

  తేహాన్స్ శౌర్యను ఆశీర్వదించిన సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య….!

Share

తల్లాడ, జూన్, 30, ( మహా ):-
తల్లాడ పట్టణానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ టౌన్ అధ్యక్షులు గరిడేపల్లి వెంకటేశ్వరరావు జివిఆర్, నాగమణి దంపతుల మనవడు శశిధర్, సింధు దంపతుల కుమారుడు తేహాన్స్ శౌర్య అన్నప్రశన్న వేడుక ఆదివారం లోని గార్ల ఒడ్డు గ్రామంలోని శ్రీ నరసింహ స్వామి దేవాలయంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సత్తుపల్లి మాజీ శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య హాజరై చిన్నారికి అక్షింతలు వేసి దీవించారు. ఈ సందర్భంగా జివిఆర్ కుటుంబ సభ్యులను ఆప్యాయంగా పలకరించి పలు విషయాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట బీఆర్ఎస్ పార్టీ తల్లాడ మండల అధ్యక్షులు రెడెం వీర మోహన్ రెడ్డి , కార్యదర్శి దుగ్గిదేవర వెంకట్ లాల్, నాయకులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.