Mahaa Daily Exclusive

  స్వచ్ఛంద సంస్థల సేవలు అభినందనీయం ఎమ్మెల్యే, కలెక్టర్..!

Share

మహా భద్రాచలం

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, మారుతి నర్సింగ్ కాలేజ్, లయన్స్ క్లబ్ భద్రాచలం, లయన క్షబ్ జటాయువు, వికాస తరంగిణి అధ్వర్యంలో యంఎన్ జె కేన్సర్ ఆసుపత్రి హైదరాబాద్ బృందము ‘పుష్పగిరి కంటి ఆసుపత్రి’ సికింద్రాబాద్ బృందం సహకారంతో ఆదివారం భద్రాచలంలోని మారుతి నర్సింగ్ కళాశాల ప్రాంగణంలో నిర్వహించిన ఉచిత క్యాన్సర్ వ్యాధి నిర్ధారణ, చికిత్స మరియు నేత్ర శస్త్ర చికిత్స శిబిరమును ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు, జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ ప్రారంభించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే తెల్లం, కలెక్టర్ జితేష్ వి పాటిల్ మాట్లాడుతూ, భద్రాచలం గిరిజన ప్రాంతంలో కంటి చూపు తక్కువతో చాలా మంది బాధపడుతున్నారని, అదే విధంగా గర్భకోశ వ్యాధులు, రొమ్ముల్లో గడ్డలతో మహిళలు బాధపడుతున్నారని ఇటువంటి పేద ప్రజల, ఆదివాసీ గిరిజనుల ఆరోగ్యం సంరక్షించేందుకు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, లయన్స్ల బ్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ శిబిరములు పేద ప్రజలకు ఎంతగానో ఉపయోగపడతాయని, స్వచ్చంద సంస్థల సేవలను అభినందించినారు ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ సంస్థ డిస్ట్రిక్ట్ కో ఆర్డినేటర్ డా.ఎస్.ఎల్.కాంతారావు, ఆర్ డి ఓ కె.దామోదర్రావు, ఎం వి ఐ యస్. వెంకటపుల్లయ్య, తదితరులు పాల్గొన్నారు.