Mahaa Daily Exclusive

  మండలంలో సిపిఐ పార్టీ 13వ మహాసభ * విచ్చేయనున్న కొత్తగూడెం ఎమ్మెల్యే కునంనేని సాంబశివరావు..!

Share

టేకులపల్లి – మహా :

టేకులపల్లి మండల 13వ మహాసభ సోమవారం ఉదయం 10 గంటలకు సిపిఐ మండల కార్యదర్శి గుగులోత్ రామ్ చందర్ ఇంటి వద్ద జరుగును. ఈ మహాసభకు సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం ఎమ్మెల్యే కామ్రేడ్ కూనoనేని సాంబశివరావు. సిపిఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి కామ్రేడ్ ఎస్ కె షాబీర్ పాషా. ఇల్లందు నియోజకవర్గ కార్యదర్శి కామ్రేడ్ కే సారయ్య. జిల్లా నాయకులు దేవరకొండ శంకర్ హాజరు కానున్నారు. కావున సకాలంలో మండల కార్యవర్గ సభ్యులు. కౌన్సిల్ సభ్యులు. శాఖ నూతన కార్యదర్శులు. కార్మికులు ప్రజా సంఘాల నాయకులు మహిళ రైతులు విద్యార్థి యువజన గిరిజన సమాఖ్య అన్ని వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావాలని మహాసభను విజయవంతం చేయాలని రామ్ చందర్ కోరారు