మధిర జూన్ 29
మధిర నియోజకవర్గ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు చేబ్రోలు రమ.
రాష్ట్రంలో సుపరిపాలన కొనసాగిస్తూ, అన్ని వర్గాల ప్రజలు సంతోషాలతో ఉంటుంటే ఓర్వలేని టిఆర్ఎస్ నాయకులు వారి ఉనికి కోసం ప్రెస్ మీట్ లు పెడుతూ అభివృద్ధి ప్రదాత *భట్టి విక్రమార్క పై ఆరోపణలు చేయడం నీచమైన చర్య.
10 సంవత్సరాల టిఆర్ఎస్ పరిపాలనలో రాష్ట్రాన్ని దివాలా తీయగా నేడు ఆర్థిక మంత్రిగా ఆర్థిక వ్యవస్థను గాడిన పెడుతూ, అభివృద్ధి,సంక్షేమానికి వెనకాడకుండా రాష్ట్రాన్ని పాలిస్తున్న ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి పై కమల్ రాజు బోనకల్ లో ప్రెస్ మీట్ పెట్టి అవాకులు, చవాకులు మాట్లాడడం మానుకోవాలి. భట్టి విక్రమార్క విమర్శిస్తే పెద్ద నాయకుడు అవుతారేమో అనుకొని కమల్ రాజు మాట్లాడుతున్నారు.
ఈ తీరు మారకపోతే రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు.
Post Views: 148








