TG: హైదరాబాద్లో భారీ వర్షాల నేపథ్యంలో మంత్రి పొన్నం సమీక్ష నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ‘వర్షాకాలంలో హైదరాబాద్కు వరద సమస్య ఇప్పటిది కాదు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో అన్ని శాఖల సమన్వయంతో నగరవాసుల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతాం. భవిష్యత్ ప్రణాళికలు, మాస్టర్ ప్లాన్ రూపొందించాలని నిర్ణయించాం. ప్రజలు కూడా ప్రభుత్వానికి సహకరించాలి’ అని కోరారు.
Post Views: 112








