BRSలో విబేధాలు ఉన్నాయని MLC కల్వకుంట్ల కవిత అంగీకరించారు. అయితే, ఇవి తమ పార్టీకే పరిమితం కావని, కాంగ్రెస్, BJPల్లో కూడా ఇలాంటి పరిస్థితులు ఉన్నాయని పేర్కొన్నారు. కాంగ్రెస్‌లో CM రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతున్నారని, బీజేపీలో బండి సంజయ్‌కు ఈటల రాజేందర్ వార్నింగ్ ఇస్తున్నారని అన్నారు. కాగా, కల్వకుంట్ల కుటుంబంలోని విబేధాలు పార్టీపై ప్రభావం చూపుతున్నాయని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
Post Views: 128








